- జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో నూతనంగా జెనెసిస్ ఫెర్టిలిటీ & లాప్రోస్కోపీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆ హాస్పిటల్ ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి , చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజం ఆరోగ్యంగా ఉండడంలో డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, సేవా దృక్పథంతో పనిచేస్తూ హాస్పిటల్ యాజమాన్యం మంచి పేరును గడించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, సీనియర్ నాయకులు ములగిరి శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, మన్నే రమేష్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, ఉమేష్ పాల్గొన్నారు.