- సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ డివిజన్ పరిధి వివేకానంద నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ,గౌరవ అధ్యక్షులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి విధివిధానాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి , మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్ , బీఎస్ ఎన్ కిరణ్ యాదవ్, రాజు నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాల హరీష్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,నాయి నేనీ చంద్రకాంత్ రావు, భిక్షపతి ముదిరాజు, మోహన్ ముదిరాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, చిన్న మధుసూదన్ రెడ్డి, సంతోష్ రావు, జోగిపేట్ భాస్కర్, పోతుల రాజేందర్, జోగిపేట్ బాలరాజు, కాశీనాథ్ యాదవ్, నిమ్మల రామ కృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, కిషన్, ఎల్లం నాయుడు, జమీర్, సబీర్, కాసాని శంకర్, రాజయ్య, గోపాల్ యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, మంజుల పాల్గొన్నారు.