- చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీలో అనేక కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా కాలనీలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయిందన్నారు. సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయన్నారు.
కార్పొరేట్ శక్తుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.