నమస్తే శేరిలింగంపల్లి : ముక్కోటి దేవతలకు ఆది గురువు, సకల సృష్టికి ఆది పురుషుడు భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి లోని గుల్మోహన్ పార్క్ వద్ద నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి విశ్వకర్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీపాడి రాము, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ, శంకరయ్య, కళ్యాణ్, గోపాల్ యాదవ్, కృష్ణమ్మ చారి, రాయదుర్గం ప్రెసిడెంట్ సోమయ్య, జగన్నాథం కృష్ణమూర్తి, వారి కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.