‘కంట్రీ చికెన్ కో’ అవుట్‌లెట్ ప్రారంభం

  • ప్రపంచంలోనే మొదటిది, భారతదేశంలో అత్యంత ప్రీమియం కంట్రీ చికెన్
  • ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచంలోనే మొదటిది, భారతదేశంలో అత్యంత ప్రీమియం కంట్రీ చికెన్ బ్రాండ్ ‘కంట్రీ చికెన్ కో’ 7వ అవుట్‌లెట్‌ను చందానగర్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు కోడి రుచి అమోఘమన్నారు.

ఈ బ్రాండ్ మరింతగా విస్తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్, సందీప్ కుమార్ సుల్తానియా, సెక్రటరీ, పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, తెలంగాణ, గౌతమ్ పోట్రు, సీఈవో ఎస్ఈఆర్ పీ తెలంగాణ, విద్యా సాగర్, స్ట్రీట్ నిధి ఎండీ, ఎన్. రజిత, ఎండీ ఎస్ఈఆర్ పీ తెలంగాణ, జి. సాయికేష్ గౌడ్, వ్యవస్థాపకుడు & సీఈవో, కో-ఫౌండర్-సిఓఓ మహ్మద్ సమీ ఉద్దీన్ , కంట్రీ చికెన్ కో సిఎస్‌ఓ అభిషేక్ పటావర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రీ చికెన్ ఫౌండర్, సీఈవో జీ సాయికేష్ గౌడ్ మాట్లాడుతూ ఏడాదిన్నర పాటు సాగిన విశేషమైన ప్రయాణంలో ‘కంట్రీ చికెన్ కో’ హైదరాబాద్‌లో ఓ సంచలనం అన్నారు. ఈ బ్రాండ్ చందానగర్ లో మరో కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా నగరంలోని నాటుకోడి, ఆరోగ్య స్పృహ కలిగిన ఔత్సాహికులను ఆనందపరిచేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. కంట్రీ చికెన్ కో హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన, సరసమైన, ప్రామాణికమైన సరఫరాదారుగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుందన్నారు. ప్రామాణికత, నాణ్యత, పరిశుభ్రత సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక స్థానిక దుకాణాల మాదిరిగా కాకుండా, కంట్రీ చికెన్ కో తన కస్టమర్లకు తాజా, అత్యధిక నాణ్యత గల మాంసాన్ని స్థిరంగా పంపిణీ చేస్తోందన్నారు.

ప్రామాణికమైన నాటు కోడి (దేశీ చికెన్), ఇతర ఉత్పత్తులను విక్రయించనున్నట్లు తెలిపారు. వీటిని గ్రామ పెరట్లలో, ఫ్రీ రేంజ్ ఫారమ్‌లలో పెంచుతారన్నారు. స్టెరాయిడ్, యాంటీబయాటిక్ రహితంగా ఉంటాయన్నారు. మూడు కేటగిరీల్లో చికెన్ కలదన్నారు. అవి గ్రామాల్లోని కోళ్లు, ఫ్రీ రేంజ్ కోళ్లు, కొత్తగా ప్రారంభించిన న్యూట్రిసాఫ్ట్ చికెన్ అన్నారు. ఇది సాధారణ చికెన్‌కి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమన్నారు. ఎప్పుడూ తాజా చికెన్ అందిచాలనేది మా ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా కో-ఫౌండర్ సీవోవో మహ్మద్ సమీ ఉద్దీన్ మాట్లాడుతూ విభిన్న శ్రేణి ఏడు పౌల్ట్రీ రకాలతో కంట్రీ చికెన్ కో అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకుంటుదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రుచికరమైన మాంసాన్ని ఆస్వాదించవచ్చన్నారు.

గుడ్లు, ఊరగాయలు వంటి ఉత్పత్తులు కూడా అందించనున్నట్లు‌‌ తెలిపారు. ‌కంట్రీ చికెన్ కో ఇటీవల కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టిందన్నారు. న్యూట్రి సాఫ్ట్ చికెన్ సంప్రదాయ బ్రాయిలర్ చికెన్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అన్నారు. ఒక కిలో లైవ్ బర్డ్‌ కేవలం రూ.179 సరసమైన ధరతో.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్‌లో 25 వేల మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారన్నారు. నాణ్యత, ప్రామాణికత, నిబద్ధతకు అంకితం కావడంతో ఈ కస్టమర్ బేస్‌ను సంపాదించామని, ఇది నిరంతర వృద్ధికి కారణమన్నారు. ఎప్పటికప్పుడు ఈ కస్టమర్ బేస్ విస్తరిస్తుందన్నారు.
కంట్రీ చికెన్ కో హైదరాబాద్ అంతటా తన ఉనికిని విస్తరింపజేస్తున్నందున.. వినియోగదారులకు అత్యంత ప్రామాణికమైన పౌల్ట్రీ ఉత్పత్తులను అందించడానికి రెడీగా ఉన్నామన్నారు. ఈ కొత్త స్టోర్ల యాడింగ్తో నగరవ్యాప్తంగా చికెన్ ప్రియులకు గో-టు డెస్టినేషన్‌గా మారడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.‌ ఈ కార్యక్రమంలో కంట్రీ చికెన్ కో సీఎస్వో అభిషేక్ పటావర్ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఈ నంబర్లలో 9959154371/ 9963980259 సంప్రదించంచాలని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here