టిపిసిసి జనరల్ సెక్రెటరీ జైపాల్ ఆధ్వర్యంలో విజయభేరి సభకు భారీగా తరలిన శేరిలింగంపల్లి పార్టీ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి : తుక్కుగూడ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయభేరి సభకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టిపిసిసి జనరల్ సెక్రెటరీ జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల బలిదానం చూసి చలించిపోయిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి బిల్లు పాస్ చేస్తే విద్యా, వైద్యం, ఉద్యోగ కల్పన, నిరుపేదలకు గృహ నిర్మాణం వంటి ప్రధానమైన పథకాలను పక్కకు పెట్టి ఉచిత స్కీములు మభ్యపెట్టే స్కీములను ప్రజలు నమ్మడం లేదని, కేసిఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో నుండి విముక్తి కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

విధేయతకి ప్రతీ రూపం సోనియా గాంధీకీ ఈసారి తెలంగాణ యావత్ ప్రజానీకం బ్రహ్మరధం పట్టనున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అసెంబ్లీ సీట్లు వచ్చేలా కనిపిస్తున్నదని, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశనంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం లాంఛనమేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంటులు పోటాపోటీగా జన సమీకరణ చేసి భారీ ఎత్తున లింగంపల్లిలోని స్కాంట స్కూల్ వద్ద వేంకటేశ్వర ఫంక్షన్ హాల్ కు తరలివచ్చారు. వారు మధ్యాహ్నం భోజనం చేసి తరువాత వారీ వారీ వాహనాలలో ర్యాలీగా బాణసంచా కాలుస్తూ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహూల్ గాంధీ జిందాబాద్, ప్రియాంక గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ ప్రచారరథంను ముందు పెట్టీ ప్రచార పాటలతో హోరేత్తి స్తూ వెనకాల వాహనాలలో వేలాదిగా వహా తుక్కుగూడా సభాస్థలికి తరలివెళ్ళారు.

ఈ కార్యక్రమంలో హరికిషన్, అయాజ్ ఖాన్, మోషీం, సురేష్ నాయక్, రాజాజీ, సౌందర్ రాజన్,రేణుక, అజిమొద్దిన్, అవుల రవి, సుజాత, శాంత, వహీదా, మారెళ్ల శ్రీనివాస్, భరత్ గౌడ్, అలీ, బసపాక యాదగిరి, జహంగీర్, లింగారెడ్డి శేరిలింగంపల్లి నియోజక వర్గ మీడియా కో ఆర్డినేటర్ తలారి కవిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here