విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుంది: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నల్లగండ్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగండ్ల హుడా కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐక్యమత్యంతో సోదర భావంతో ఆనందంగా జీవించాలని అన్నారు. విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. తదనంతరం లడ్డు వేలం పాటలో పాల్గొని మొదటి లడ్డును 30 వేలకు కైవసం చేసుకున్న నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షులు రంజిత్ పూరిని, రెండో లడ్డును 70 వేలకు కైవసం చేసుకున్న నల్లగండ్ల హుడా కాలనీ జావీద్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలేందర్ రెడ్డి, నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షులు రంజిత్ పూరి, ప్రధాన కార్యదర్శి భరత్, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రంగస్వామి, వెంకటేష్, శంకర్, స్థానిక నేతలు, భక్తులు, మహిళలు, కాలనీ వాసులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here