నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ప్రతి శనివారం అన్నమయ్య కీర్తనల ప్రచారంలో భాగంగా చేపట్టిన అన్నమ స్వరార్చన అలరించింది.
అమ్మనభ్రోలు లక్ష్మీ కాంతం వారి శిష్యులు కలసి త్వదీయ, భావములోన, కొండలలో నెలకొన్న, తిరుమల గిరిరాయ, ఏమని పోగడుదుమే, జయ లక్ష్మీ వర లక్ష్మి, సిరుత నవ్వుల వాడు, కలిగెనిదే నాకు కై వల్యము, రాముడు రాఘవుడు, నారాయనతే నమో నమో, జయ మంగళం, క్షీరాబ్ది కన్యకు అంటూ పావని, జోస్యుల కుటుంబ శాస్త్రి, జోస్యుల కమల, కె. రాజశ్రీ, భాను, శైలజా, శోభా, నిహారిక, హాద్వీత ఆలపించి మెప్పించారు. వీరికి వేణువు పై కేశవ దాసు, మృదంగం పై హరి కృష్ణ వాయిద్య సహకారం అందించారు. అనంతరం లక్ష్మీ కాంతంని, శిష్యులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి శోభా రాజు సత్కరించారు.