విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాసుల పంపిణీ

  • తాగునీరు, టాయిలెట్స్, అదనపు తరగతి గదుల సమస్యలు తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
  • ప్రధానోపాధ్యాయురాలు వసుంధర వినతి మేరకు సమస్యలు పరిష్కరిస్తానని హామీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్టీసీ బస్ పాసుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మియాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు హాజరై విద్యార్థులకు బస్సు పాసులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు వసుంధర ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, టాయిలెట్స్, అదనపు తరగతి గదులు గురించి వివరించారు. ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ మంజీరా వాటర్ పైప్ లైన్ వేయించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, టాయిలెట్స్ సమస్యను సేవా సంస్థ ద్వారా పరిష్కరిస్తానన్నారు. అదనపు తరగతులు గురించి విద్యా శాఖ దృష్టికి తీసుకెళ్లి నిధులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమ సుందర్ ట్రస్ట్ చేస్తున్న సేవలను తలుచుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్,శేఖర్ గౌడ్, కాకర్ల అరుణ, సిల్వర్ మనీష్, సత్యారెడ్డి, అంజద్ అమ్ము, రవీందర్రావు, రవణ, బిఆర్ యువసేన పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here