వేమన వికర్ సెక్షన్ కాలనీలో ముఖద్వారం ఏర్పాటు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారాన్ని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వేమన వికర్ సెక్షన్ కాలనీలో ఈ రోజు కాలనీ ముఖ ద్వారం ప్రాంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, కాలనీ ముఖద్వారం కాలనీ చిరునామాకు సంకేతంగా ఉపయోగపడుతుందని, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటదని, వేమన వికర్ సెక్షన్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here