నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మండల విద్యాశాఖ అధికారి వాణికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శేరిలింగంపల్లి సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లిలోని వివిధ స్కూళ్లను పర్యటించగా అక్కడ నెలకొన్న సమస్యలతో
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి టి రామకృష్ణ అన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని, స్కూళ్లలో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, ఏ స్కూల్ ను పరిశీలించిన నిలువెత్తు సమస్యలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే వెంకటస్వామి, సిపిఐ రంగారెడ్డి జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్, ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి కే సుధాకర్, ఎం. రామస్వామి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి జెట్టి శ్రీనివాస్, ఎస్. కురుమయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు టి. నితీష్, ఆర్. కార్తీక్, ఎస్. కిరణ్ , కె. సంతోష్, కే దూర్ పాల్గొన్నారు