- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి ఇన్చార్జి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర కాలనీలో సుఖ్ శాంతి భవన్, రాజయోగా మెడిటేషన్ సెంటర్ వద్ద రాజయోగా ఓం శాంతి సంస్థ 88వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి బండి రమేష్, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, జోన్ ఇంచార్జ్ సరోజిని దిది, సెంటర్ ఇంచార్జ్ జ్యోతి దీదీతో కలిసి శేరిలింగంపల్లి ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజయోగా మెడిటేషన్ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం ఈ సంస్థ ప్రతి అడుగు ముందుకు వేస్తుందని, 2009వ సంవత్సరంలో కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత తిరుపతికి పాదయాత్రగా వెళ్లిన సమయంలో కర్నూల్ రాజయోగా కేంద్రంలో ఓం శాంతి సంస్థ వాళ్ళు ఇచ్చిన అతిథ్యాన్ని, గత 15సంవత్సరాలుగా ఓం శాంతి కేంద్రంతో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి, కల్పన ఏకాంత్ గౌడ్, ముకన్న, వెంకన్న, కాలనీ జనరల్ సెక్రటరీ సూర్య రావు, వెంకటస్వామి సాగర్, దుర్గా, కిషన్ రావు పాల్గొన్నారు.