అధికారమే పరమావధిగా కృషి చేస్తాం

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి అధ్యక్షులు వెంగళ్ రావు యాదవ్ తో ఆత్మీయ సమావేశం
  • ఏపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గా డి. హరిబాబు యాదవ్ కు నియామక పత్రం అందజేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

నమస్తే శేరిలింగంపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి అధ్యక్షులు వెంగళ్ రావు యాదవ్ తో నిర్వహించిన ఆత్మీయ సమావేశం వేడుకగా జరిగింది. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గా డి. హరిబాబు యాదవ్ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి మిత్ర మండలితో సహా కలిసి శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డబ్బు కొట్టు హరిబాబు మాట్లాడుతూ అధ్యక్షుడి అడుగులో అడుగు వేస్తూ రాష్ట్ర బీసీల అందర్నీ ఏకం చేయటానికి కంకణం కట్టుకున్నామని, బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరినీ కలుపుకొని ఏకంగా ఐకమత్యంతో రాజ్యాధికార సాధన దిశగా ముందుకెళ్తానని తెలిపారు. ఆయనకు పూర్తి సహకారం అందిస్తానని ప్రధాన కార్యదర్శికి హామీ ఇచ్చారు.

అన్ని విధాలుగా తమ వంతు సహకారం అందిస్తామంటూ హామీ ఇస్తూ..

జాతీయ ఉపాధ్యక్షుడు బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రెండు రెండు కళ్ళ లాంటివని, ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా బీసీలను ఏకం చేసి ఐకమత్యంతో విశ్రమించకుండా రెండు రాష్ట్రాల్లోనూ అధికారమే పరమావధిగా కృషితో పోరాటం చేసి అన్నింటికి ఎదురెడ్డి అధికారం సాధిస్తామని, ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న బిసి ఐక్యవేదికతో కలిసి అన్ని పోరాటాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. బీసీ ఐక్యవేదిక యువజన అధ్యక్షులు అందేల కుమార్ యాదవ్ ప్రసంగిస్తూ బీసీ ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొని తరతరాల బానిసత్వం ఉన్న బీసీలను బానిసత్వం నుండి విముక్తి చేసి అధికారం సాధించుటలో ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలు, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రణాళిక ద్వారా సాగుతున్న ఈ పోరాటంలో యువత మొత్తం తమ వంతు సాహస సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, యువజన అధ్యక్షులు కుమార్ యాదవ్ హరిబాబు గారి నియమాకాన్ని కార్యదీక్ష తను కొనియాడారు. సభలో పాల్గొన్న పెద్దలందరి ఆశీర్వాదంతో యువ నాయకుడు హరిబాబు యాదవ్ నియామకాన్ని కొని ఆడుతూ సభ విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here