నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఫౌండర్, చైర్మన్ పోల కోటేశ్వర్ రావు, కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సుమారు 600 మందికి అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేసి అన్న సమారాధన స్వీకరించారు.