ఈవీఎంల టాంపరింగ్ చేసేందుకు బీజేపీ కుట్ర

  • దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఆరోపణ

నమస్తే శేరిలింంగంపల్లి: ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలలో జరిగిన సాధారణ 2024 ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యుర్డులను గెలిపించికోవడానికి ఈవీఎం మిషన్లలో ఓటర్ల తీర్పు ను తారుమారు చేయడానికి బీజేపీ కేంద్రం లోని మోడీ అమిత్ షా సర్కార్ కుట్రలకు పాల్పడుతున్నారని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఆరోపించారు. నేడు హిమాయత్ నగర్ లోని పార్టీ కేంద్రం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈవీఎంలను టాంపరింగ్ చేయడం ద్వారా మరొక సారి బీజేపీ ఎంపీ స్థానాలను గెలిపించుకోవడo కోసం తీవ్రంగా ప్రయత్నం ప్రారంభించిందని విమర్శించారు.

వివిధ రాష్ట్రాల సీఈఓలను తన అదుపులో పెట్టుకున్నారని, ఇప్పటికే బీజేపీ ఎన్నికలు ముగిసిన ప్రాంతాలలో కౌంటింగ్ ప్రారంభించకముందే ఈవీఎం మిషన్లను టాంపరింగ్ చేస్తున్నారని, పలుచోట్ల వాటిని ఎత్తుకెళ్లారన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ను కొనేసారని ఎన్నికల అధికారులును తమ జేబులో పెట్టుకున్నారని, ఈసీఐ పూర్తిగా బీజేపీ మోడీ సర్కార్ కు అమ్ముడు పోయారన్నారు. ఎన్నికల్లో ఈవీఎం మిషన్ లను ఉపయోగించవద్దని దేశ ప్రజలు ఎంత మొత్తుకున్న ఈసీఐ పట్టించుకోలేదని, ఈ విషయం పైనే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సైతం చేతులు ఎత్తేసిందన్నారు. మోడీ టాంపరింగ్ చర్యకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్, ఏపీలోని జగన్ రెడ్డి సర్కార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపణలు చేశారు. బీజేపీ కేంద్రం చెప్పినట్లు 400 ఎంపీ సీట్లు సంపాదించుకోవడం ద్వారా డాక్టర్. అంబేద్కర్ సమతా రాజ్యాంగంను రద్దు చేసి దాని స్థానం లో మను వైదిక మాఫియా ఫాసిస్ట్ రాజ్యాంగంను తీసుకొని రావడానికి శతవిధాలా ఆర్ఎస్ఎస్, బీజేపీఫాసిస్ట్ చర్యలకు పాల్పడుతున్నదని కృష్ణ స్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ హనుమంతు, పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి గోలి నరేష్, పార్టీ గోశామహల్ ఇంచార్జ్ ఎస్. రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here