నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందరయ్య 39వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సమావేశం ఆ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి. ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ పాల్గొని మాట్లాడారు. 39 సంవత్సరాలైనా నేటికీ సుందరయ్యని గుర్తు పెట్టుకొనే వారు చాలా మంది ఉన్నారన్నారు. ఆయన నిబద్దత చిన్న వయసులోనే తన ఇంట్లోనే ప్రశ్నించడం ప్రారుభిుచారని తెలిపారు. పనులు చేసేవారికి వేరు, వారికి వేరుగా భోజనం పెడితే వ్యతిరేకించేవారన్నారు.

మహిళలను చిన్న చూపు చూస్తే కూడా దానిపై ప్రశ్నిచ్చేవారని, బిజెపి ప్రభుత్వం వల్ల ఈరోజు చాలా మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయాన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేక ఉద్యమ పోరాటంలో పాల్గొన్నట్లు చెప్పారు. పెళ్ళికి సంబంధించి మతాంతర వివాహం హంగూ ఆర్భాఠాలు లేకుండా చేసుకున్నారన్నారు. తనకు వచ్చిన ఆస్తిని కూడా పార్టీ కోసం ఖర్చు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆర్. సాంబశివరావు, శ్రీనివాస్, శేరిలింగంపల్లి ఏరియా కన్వీనర్ శోభన్, కృష్ణ, రవీందర్ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.