- ఇజ్జత్ నగర్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉత్సవం
- పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కొత్తగూడ ఇజ్జత్ నగర్ ఖానామేట్లో ఎర్రగుంట్ల వైశాలి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు.
అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శం అని అన్నారు. పూజా కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రం యువజన విభాగం అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.