అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్టాపనా మహోత్సవం

  • పాల్గొన్న పలువురు ప్రముఖులు
  • చివరి రోజు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

నమస్తే శేరిలింగంపల్లి : గత మూడు రోజులుగా గోపన్ పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిస్థాపన వేడుకలను భక్తులు, నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని, భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. చివరి రోజు బుధవారం పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గోపన్ పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం. రవికుమార్ యాదవ్

ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం. రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గోపన్ పల్లి వాసులకు బొడ్రాయి పండుగ శుభాకాంక్షలను తెలుపుతూ, బొడ్రాయిని ఊరి గ్రామ రక్షకుడిగా కొలుచుకుంటామని, ఊరంతా సంతోషంగా ఉండాలని, ఎటువంటి అరిష్టాలు, ఆటంకాలు జరగకుండా ప్రార్ధించారు. ఆ భగవంతుని దయవల్ల శుభాలు జరగాలని మీ బిడ్డగా గా ఇప్పటికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గొప్పగా ఆశీర్వదించారు.

రవికుమార్ యాదవ్ కు బొట్టు పెడుతూ..

రాబోవు రోజుల్లో కూడా ఇలానే మీ అందరి ఆశీర్వాదం అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సీనియర్ నాయకులు, గోపనపల్లి గ్రామం వాసులు, స్థానిక భక్తులు, మహిళలు, పిల్లలు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here