కోరిక తీర్చాలంటూ కన్న కూతురినే హతమార్చిన తండ్రి…

  • వసంత కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి :  బాలిక బానోతు వసంత కేసు మిస్టరినీ మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఇందుకు సంబంధించి వివరాలను మియాపూర్ ఏసీపీ నరసింహారావు, మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్, ఎస్సై రాజులతో కలిసి వెల్లడించారు.  ఈ నెల మొదటి వారంలో నరేష్, శారద దంపతులు మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం నుండి మియాపూర్ నడిగడ్డ తండాకు వలసవచ్చారు. ఓ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ, మద్యం సేవిస్తూ దుర్వస్యనాలకు అలవాటు పడ్డాడు. రోజూ మొబైల్ లో ఫోర్న్ వీడియోలు చూస్తుండే వాడు, రెండు రోజులుగా అతడి ఫోన్ డిస్ప్లే పని చేయకపోవడంతో మరింత ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో తన కూతురు ఊరు వెళ్తానని చెప్పడంతో ఇదే అదునుగా భావించిన నరేష్ ఆమెను బస్సు ఎక్కించి వస్తానని చెప్పి బైక్ పై తీసుకువెళ్లి మియాపూర్ మెయిన్ రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం అక్కడి నుండి నడిగడ్డ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లాడు. తన కోరిక తీర్చాలంటూ బాలిక మీద ఒత్తిడి చేశాడు.

వివరాలు వెల్లడిస్తున్న మియాపూర్ ఏసీపీ నరసింహారావు

అమ్మకు చెప్తానని వసంత గట్టిగా అరవడంతో ఇంట్లో వాళ్లకు చెప్తే తన పరువు పోతుందన్న భయంతో ఏ మాత్రం కనికరం లేకుండా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. బాలిక ముక్కు, చెవులలో నుండి రక్తం కారడంతో  అక్కడికక్కడే మృతి చెందింది. 11 నిమిషాల వ్యవధిలోనే బాలికను హతమార్చి బయటకు వచ్చాడు. కాసేపటి తర్వాత బాలిక చనిపోయిందా లేదా తెలుసుకునేందుకు మరోసారి ఆ ప్రదేశానికి వెళ్లాడు.

నిందితుడు బానోతు రమేశ్

వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ వచ్చాడు నిందితుడు. అక్కడి నుండి వచ్చి భార్యతో కలిసి తన కూతురు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడు రోజుల తర్వాత బాలిక ఆచూకీ లభించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన మియాపూర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని  విచారించగా తానే హత్య చేసినట్లు బాలిక తండ్రి ఒప్పుకున్నాడని ఏసీపీ నరసింహారావు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here