కనుల పండువగా రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం

  •  బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దగోని రమేష్ గౌడ్ నివాసంలో కార్యక్రమం
  • పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధి మధురా నగర్ కాలనీలో గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దగోని రమేష్ గౌడ్ నివాసంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్, నారాయణ, గోవింద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here