- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి సమస్యలు విన్నవించిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తన నివాసంలో ఆ కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమ కాలనీలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పోచమ్మ గుడి దగ్గర 40 మీటర్ల సీసీ రోడ్డు, శ్రీకృష్ణుని గుడి ఎదుట 80 మీటర్ల సీసీ రోడ్డు, పార్ధు స్ట్రీట్ 80 మీటర్లు, గణేష్ టెంపుల్ దగ్గర 30 మీటర్ల సీసీ రోడ్డు, చర్చి ఎదుట 30 మీటర్ల సీసీ రోడ్డు, గల్లీలో 40 మీటర్లు సీసీ రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.
ఈద్గా నుంచి పోచమ్మ టెంపుల్ వరకు మంజీరా వాటర్ పెద్ద లైను వేయాలని, చాలా గల్లీలో కరెంటు పోల్స్ ఉన్నాయని, త్రీఫేస్ కరెంటు కేబుల్స్ లేవని, వెంటనే వేయాలని ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందించారు. కాలనీ వాసుల ఆయన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సత్యం గౌడ్, మంగలి కృష్ణ, ప్రభాకర్, బాలా చారి, మల్లేష్ ,శివ, నాయుడు పాల్గొన్నారు.