- బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ర్యాలీ
- బాలిక తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ నడిగడ్డ తండాలో బాలిక బానోతు వసంత కేసులో కన్న తండ్రే ఆమెను హత్య చేసినట్లు మియాపూర్ ఛేదించారు. ఈ ఘటనలో హత్య చేసిన కన్నతండ్రి బానోతు నరేష్ ను కఠినంగా శిక్షించాలని, బానోత్ వసంత ఆత్మకు శాంతి చేకూరాలని బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తులన మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుండి జేపీఎన్ నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కన్నతండ్రే కాలయముడై, కామాంధుడై తన కూతుర్ని కాటేస్తే సమాజం ఎటు పోతుందని ప్రశ్నించారు. మానవతా విలువలు మర్చిపోయి, మమతాను రాగాలను మంటగలిపి, సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలకు బానిసై సొంత కూతురిపై అఘాయిత్యం చేయబోయిన బానోతు రమేశ్ ను కఠినంగా శిక్షించాలని, మరెవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు నరసింహ, శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్ యాదవ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ అందెల కుమార్ యాదవ్, మహిళా అధ్యక్షులు భవాని, సరోజినమ్మ, వెంకటమ్మ, లక్ష్మి, రుక్మిణి, మరియు బీసీ సంఘాల నాయకులు మహిళలు యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.