నమస్తే శేరిలింగంపల్లి : వరద నీటి కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి పై అను ఫర్నిచర్ షో రూమ్ వద్ద వరద నీటి కాల్వ నిర్మాణం పనులను పరిశీలించి మాట్లాడారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పూర్తి చేయాలని, వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులు వేగవంతం చేయాలని, వరద నీటి కాల్వ నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మీనారాయణ, రాంచందర్ పాల్గొన్నారు.