నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై దశరథ్ కుమార్ బదిలీ పై వెళ్తున్న సందర్భంగా సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కమిటీ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికింది. రెండున్నర సంవత్సరాలుగా నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తించారని, కాలనీ ప్రజల అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారని కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తెలిపారు. అసోసియేషన్ తరపున కమిటీ సభ్యులు అందరు మనస్పూర్తిగా, చిరు సత్కారంతో కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివ గౌడ్. ప్రధాన కార్యదర్శి ఎండి మోషన్ ఖాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్. అడ్వైజర్స్. ఎండి సాజిద్ అలీ. సత్యనారాయణ. (రిటైర్డ్ ఎమ్మార్వో), రమేష్, అబ్దుల్ రెహమాన్. ఆదిత్య నగర్ యువ నాయకులు ( హనీప్). సలీం, మీయాన్ పటేల్. బాబా. రహీం. సోను. శ్రీను. విక్రమ్. భాయ్. ముజీబ్. సయ్యద్ గయసుద్దీన్. హసన్. విజయ్. నవాజ్. సాబీర్ బాయ్. తదితరీ కాలనీవాసులు కమిటీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.