నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర సమర యోధుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జయంతినీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఉషా ముళ్ళపూడి కమాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఆ కమాన్ వద్ద అల్లూరి విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతితో పాటు ఎల్లమ్మబండ లో నూతనంగా విగ్రహావిష్కరణ చేసిన మరొ ఉద్యమ నేత, రాజకీయ దురంధరుడు వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా వారి నివాళులర్పించి మాట్లాడారు. భారత స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహా జ్వలశక్తి, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం, అగ్గిపిడుగు, మాన్యం విప్లవ వీరుడు తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వీర, కిశోరం మన అల్లూరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన వీరుడు, యోధుడు అని కొనియాడారు.
కార్యక్రమ నిర్వాహకులు అల్లూరి రామరాజు, మణి భూషణ్ భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ నరేష్, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, నవీన్ గౌడ్, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, వీరాచారి, శేషయ్య అరుణ్ కుమార్, గోపాల్ రావు, సునీల్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణంరాజు, సీతారామరాజు, బాలు యాదవ్, స్రవంతి, లలిత రెడ్డి, సైదమ్మ, మమత, జయశ్రీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు