సాధారణ కుటుంబం నుంచి దేశ ఉత్తమ ప్రధానిగా అటల్ బీహార్ వాజ్ పేయి ప్రయాణం : రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 98వ జయంతి జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హైదర్ నగర్ డివిజన్, వివేకానంద నగర్, శేరిలింగంపల్లి డివిజన్లలో వాజ్ పేయి చిత్రపటానికి
బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు, అనాథాశ్రయాలలో దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ తో పాటు నియోజకవర్గ కన్వీనర్ రాఘవేందర్ రావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, నాగులు గౌడ్ , బొబ్బ నవత రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తో పాల్గొన్నారు.

వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

వీరు యాదవ్, గోపాల్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బీహారీ వాజ్ పెయ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం జరిగిన పోరాటం లో కీలక పాత్ర పోషించారని, ప్రధాని అయిన నెల రోజుల లో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించిన ఘనత వాజ్ పెయికే దక్కిందని తెలిపారు. రహదార్ల ప్రాజెక్టులు, విదేశీ విధానం, ఆర్థిక సంస్కరణలు ఇలా ఎన్నో అమలు చేశారని, వాజ్ పెయి ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పథకాల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం అత్యంత ప్రసిద్ధి గావించినాయని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

వాజ్ పేయి జయంతి సందర్బంగా కేక్ కట్ చేసి బిజెపి శ్రేణులకు కేక్ తినిపిస్తున్న బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here