శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం కప్ 2026 స్టేట్ లెవల్ టైక్వాండో పోటీల్లో ముకుల్ టైక్వాండో అకాడమీకి చెందిన హన్సిక సత్తా చాటింది. పోటీల్లో హన్సిక బంగారు పతకం సాధించిందని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. తమ అకాడమీ తరఫున ఆమె ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు. నేటి తరం యువత, ముఖ్యంగా యువతులు టైక్వాండోలో శిక్షణ పొందాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంకా అనేక పోటీల్లో తమ విద్యార్థులు పాల్గొని పతకాలను సాధించినట్లు తెలిపారు. హన్సికకు రూ.20వేల నగదు బహుమతి లభించిందన్నారు.






