నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు.. ఆ మహానుభావుని సేవలు, ఆయన మంచితనం, నేర్పరితనం ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నేటి సమాజం పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో D శివకుమార్, G. శ్రీనివాస్ ముదిరాజ్, p. వేణు గోపాల్, జ్ఞాన చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, సాయికుమార్ నేత, నాగేశ్వర రావు, లలిత, అమరేందర్ సింగ్, కృష్ణ మోహన్, సుధాకర్ యాదవ్, సందీప్ కుమార్, రమణ కుమారి, రాధిక, వనమా శ్రీనివాస్ పాల్గొన్నారు.