నమస్తే శేరిలింగంపల్లి: క్రిస్టమస్ పర్వదినం సందర్బంగా వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి క్రిస్టమస్ కేక్ ను కట్ కట్ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణలతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోజేష్, కాశినాథ్ యాదవ్, రాము,మద్దెల రాము,అర్జున్, మధు, థామస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.