విద్యార్థులు క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాలి: మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీ లో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సన్నద్ధం కోసం పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, కలాలు) ల‌ను విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు అంద‌జేశారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సన్నద్ధం కోసం పరీక్షల కిట్ ల‌ను అందించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాన‌ని అన్నారు. విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, తల్లిదండ్రులకు, సమాజానికి మరింత మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ నిమ్మల జితేంద్ర, సిబ్బంది, క్షత్రియ సేవ సమితి ప్రెసిడెంట్ సుధీర్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ సురేష్ వర్మ, జాయింట్ సెక్రటరీ చైతన్య వర్మ, క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులు రవితేజ వర్మ, యశ్వంత్ వర్మ, సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here