నమస్తే శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఎన్నికైనది మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనను ఏఎస్ రాజు నగర్, జే పి నగర్ కాలనీల వాసులు మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ మాట్లాడుతూ ఏఎస్ రాజు నగర్, జెపి నగర్ కాలనీవాసులు, అభినందన సభ ఏర్పాటు చేసి తనకు కృతజ్ఞతలు తెలియజేసినందుకు వారికి, అసోసియేషన్ సభ్యులకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను స్టాండింగ్ కమిటీలో ప్రస్తావించి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.