- “మహిళా చైతన్యం పై మాట్లాడుదాం రండి” పుస్తకం ఆవిష్కరణ
నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పసుపులేటి వెంకటేశ్వర్ రావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. వెంకటేశ్వర్ రావు 90వ జయంతి సందర్బంగా మహిళా చైతన్యం పై మాట్లాడుదాం రండి అంటూ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు పిలుపునిచ్చారు. హెచ్సిఏహెచ్ గచ్చిబౌలిలో సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్ రావు 90వ జయంతి సందర్బంగా “మహిళా చైతన్యం పై మాట్లాడుదాం రండి”అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ అనువాదాన్ని ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరణ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు టి. జ్యోతి పుస్తక పరిచయం చేశారు.
ఈ సందర్బంగా పసుపులేటి వెంకటేశ్వర్ రావు, పి జానిలా, పి సుశీల వారి అవయవదనం చేస్తూ అంగీకార పత్రాలను అమ్మ నేత్ర అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల సంఘo వారికి అందచేశారు. సభలో వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో CITU యూనియన్ నిర్మించడంలో అయన కృషి మరువలేనిదని అన్నారు. నిరంతరం కార్యకర్తల అభివృద్ధి కోసం ఆలోచించేవరని అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించామనేది కాదని, ఎలా జీవించామనేది ముఖ్యమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మహిళల భాగస్వామ్యాన్ని పోరాటాల్లోకి తెచ్చిందని అన్నారు. పితృశ్వమిక సమాజంలో మహిళల సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రావు కూతుళ్లు పి జానిలా, పి.సుశీల, అల్లుడు అశోక్ కుమార్, అమ్మ నేత్ర అవయవ, శరీరదాన ప్రోత్సాహకుల సంఘo వ్యవస్థపాక అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జి నర్సింహా రావు, యూటీఎఫ్ సీనియర్ నరహరి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు అరిబండి ప్రసాద్ రావు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత, రాష్ట్ర కమిటి సభ్యురాలు పి రామ, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యం అడివయ్య, ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి వరమ్మ, ప్రగతినగర్ మాజీ సర్పంచ్ శాంతకుమారి వివిధ సంఘాల నాయకులు పార్థసారథి, రాఘవయ్య, కృష్ణ, అనంతరెడ్డిలతోపాటు వారితో కలిసి పనిచేసిన నాయకులు, పడుపులేటి కుటుంబం సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.