నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి 106 డివిజన్ అద్యక్షురాలు దొంతోజు ఇందుమతి నాయకత్వంలో, మధర్ థెరిస్సా బ్లడ్ సెంటర్ సౌజన్యంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యకరమానికి జనసేన పార్టీ కార్యకర్తలు, యువకులు విశేషంగా పాల్గోని రక్తదానం చేశారు. సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ రక్తదాన శిభిరం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.