నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మియాపూర్ బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. నిన్న రాత్రి ఇద్దరి మధ్య సంఘటన మధ్య సేవనం వల్లే జరిగిందని, అదే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో నెత్తి పై గట్టిగా కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. ఇతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.