నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఎంఎన్ఆర్ స్కూల్ వెళ్లే దారిలో, చందానగర్ శ్రీదేవి థియేటర్ రోడ్డులో రహదారి పక్కన చెత్తను ఇష్టానుసారంగా వేయడంతో చెత్త కుండిలా మారుతున్నాయి. కాలని వాసులు వాహనదారులు విజ్ఞప్తి మేరకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఆయ ప్రాంతాలను పరిశీలించి జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులతో చెత్తను తొలగించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రహదారులపై కాలనీలలో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్తను వేస్తే జిహెచ్ ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెత్తను స్వచ్ఛ ఆటోల్లో పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. చెత్తను సేకరించే ఆటోలు కాలనిలలో రాకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు ఎమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు కాలనీ వాసులు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.