క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యం : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి: మసీదు బండ లోని కార్యాలయంలో రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్థం , సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తారీఖున ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ విడుదల చేశారు.

ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను విడుదల చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడారంగంలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి వాళ్లను రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి పంపించాలనే సదుద్దేశంతో ఆర్ .కె. వై ఫౌండేషన్ ద్వారా ఈ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం ఆర్.కే వై ఆఫీస్ 9989890000, ఆర్.కే.టీం అధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్ 9866622349ను సంప్రదించాలని తెలిపారు. తమ టీం లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి , చిన్నా రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, కర్చర్ల ఎల్లేశ్, అనిల్ కుమార్ యాదవ్, రాజు శెట్టి, అరుణ్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, దేవేందర్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here