ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరిస్తాం

  • శివాజీ నగర్ కాలనీలో రూ. 25 లక్షలు, అంజయ్య నగర్ లో రూ. 30 లక్షలు, తార నగర్ , లింగంపల్లి గ్రామంలో రూ. 25 లక్షలతో యూజిడి నిర్మాణం
  • భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయం : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
  • భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
శివాజీ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి శివాజీ నగర్ కాలనీలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, కార్పొరేటర్లు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ చూపామని, ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ (1Km) మేర చొప్పున భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అత్యవసరం ఉన్నచోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి వచ్చినా తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ, మేనేజర్ సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు ఉరిటీ వెంకట్ రావు, జనార్దన్ రెడ్డి, యాదగిరి గౌడ్, దాసరి గోపి, మల్లేష్, వెంకటేష్, నాగరాజు, రాంచందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అక్బర్ ఖాన్, పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా, కొండల్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, సందీప్, యశ్వంత్, అవినాష్, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి రెడ్డి, పార్వతి నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

  • అంజయ్య నగర్ లో..
కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి భూగర్భ డ్రైనేజి (UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో రూ. 30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నారాయణ, మేనేజర్ యాదయ్య, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణా గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు ఊట్ల కృష్ణ, జె. బలరాం యాదవ్, చాంద్ పాషా, జంగం గౌడ్, నరసింహ సాగర్, బసవ రాజు, బుడుగు తిరుపతి రెడ్డి, సాగర్ చౌదరి, షేక్ ఫాజిల్, విక్రమ్, రామకృష్ణ, తిరుపతి యాదవ్, బండ కుమార్, యాదయ్య గౌడ్, గణపతి, గౌరీ, స్వామి సాగర్, ఖాసీం, రవి శంకర్ నాయక్, సాయిబాబు, సుగుణమ్మ, ఆనంద్, రవి యాదవ్, సందీప్, విజయ్, లింగారెడ్డి, రాజు, అంజయ్య, కృపాకర్, గాలి రెడ్డి, కిషోర్, జి రాము, ఫరూక్, కిరణ్, జహంగీర్, మల్లి, శరత్, సాయి శామ్యూల్ కుమార్, తిరుపతయ్య, విజయ్ కుమార్, శ్రీను, రాజన్న, నరేష్ ముదిరాజ్, వినయ్, సైదులు సాగర్, రాము, ఉదయ్ కిరణ్,
నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

  • తార నగర్, లింగంపల్లి గ్రామంలో..
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జలమండలి అధికారులతో కలిసి భూగర్భ డ్రైనేజి (UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్, లింగంపల్లి గ్రామంలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ, మేనేజర్ సుబ్రమణ్యం, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు మల్లికార్జున శర్మ, అబీబ్, పద్మారావు, కృష్ణ యాదవ్, పొడుగు రాం బాబు, నటరాజు, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణ, గోపి, గోపాల్ యాదవ్, రవి యాదవ్, నరసింహ రెడ్డి, కవిత , కర్ణాకర్ గౌడ్, సలీం, నరేందర్ బల్లా, నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here