శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణం బాధ్యత నాదే : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • డబుల్ బెడ్ రూమ్ కేటాయింపునకు కృషి
  • జర్నలిస్టుల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తాం
  • TUWJ రాష్ట్ర, జిల్లా నాయకులతో చర్చలో ఎమ్మెల్యే హామీ
  • TUWJ-H143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ లో 30న జరిగే టీయుడబ్లూజే-143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి పూర్తి బాధ్యత తనదేనని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ లో 30న జరిగే టీయుడబ్లూజే-143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా మహాసభలకు హాజరు కావాలని కోరుతూ శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీకి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి జర్నలిస్టుల పలు సమస్యలను TUWJ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఎమ్మెల్యేతో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైతే తన ఎమ్మెల్యే నిధులు వెచ్చిస్తానని తెలిపారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు కృషి, గతంలో మంజూరు చేసిన ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్లూజే-143 రాష్ట్ర నాయకులు ఫైళ్ల విట్టల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ గౌడ్, టెంజు అధ్యక్షుడు పోచగోని సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.కిషోర్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి జర్నలిస్టులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here