నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కో-కన్వీనర్‌గా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన దుర్గం శ్రీహరి గౌడ్ అధికారికంగా నియమితులయ్యారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చేందుకు సంసిద్ధంగా ఉన్నానని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. తన కింది స్థాయి నాయకులూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తానని చెప్పారు. పార్టీ తలపెట్టిన సంక్షేమం ప్రజలకు దరికి చేర్చేలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర కో-కన్వీనర్‌గా నియమితులైన సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం పొందారు.