వేడుకగా ఫలహారం బండి ఊరేగింపు

  • కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంచందర్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పురుషోత్తము యాదవ్, బిఎస్ ఎన్ కిరణ్ యాదవ్ , గంగాధర్, మోహన్ ముదిరాజు, మహేందర్ ముదిరాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గోపారాజు, చంద్రిక, రోజా, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here