చెరువులను సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలోని కుడికుంట చెరువు అభివృద్ధిలో భాగంగా రూ.65 లక్షలతో చేపట్టబోయే చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులకు ఇరిగేషన్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు.
చెరువుల సుందరికరణలో భాగంగా చెరువు కట్టల పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని పేర్కొన్నారు. త్వరితగతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెరువు అపరిశుభ్రం వల్ల పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను , అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడం వల్ల దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని, చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని, అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఎఈ నాగరాజు శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, కృష్ణ యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, కోడిచెర్ల రాములు, నటరాజు, శ్రీనివాస్, వసంత సాయి, సత్యనారాయణ, సైబర్ మెడోస్ అధ్యక్షులు నాగేంద్ర కుమార్, సెక్రటరీ రమేష్ మండవ , కాలనీ వాసులు రాజశేకర్, బ్రహ్మ రెడ్డి, సురేష్, శ్రీనివాస్, అశోక్ కాలనీవాసులు పాల్గొన్నారు.