నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్‌గా రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గౌరవాధ్యక్షులు, ఏఐసీసీ మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తానని తెలిపారు.