నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సీనియర్ నాయకుడు ఇమామ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తిరిగి తన సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు, అమలు కానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని, పక్క పార్టీల వారిని పార్టీలో చేర్చుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మభ్య పెట్టి ప్రలోబాలకు గురి చేస్తూ పార్టీలో చేర్చుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితోలో కాంగ్రెస్ పార్టీ దిగజారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబ శివరావు, జంగయ్య యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, కరీం, పితాని శ్రీనివాస్, సాంబయ్య మామిడల రాజు పాల్గొన్నారు.