- పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
- చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి పూర్తి స్థాయి మద్దతు పలికిన పాస్టర్లు
నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పాస్టర్ల తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు.
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి పూర్తి స్థాయి మద్దతు తెలియచేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రైస్తవ సమాజం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, క్రైస్తవుల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లు పాల్గొన్నారు.