తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 నూతన సంవత్సర క్యాలెండర్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కాసిం గుల్ మోర్ పార్క్ అధ్యక్షులు హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. మరో అతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తెల్ల హరికృష్ణ పాల్గొని తన సందేశం వినిపించారు.

లంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బీసీ ఐక్యవేదిక జేఏసీ విస్తరించి ఐకమత్యం ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొని రావాలని కోరారు. కస్తూరి గోపాలకృష్ణ జాతీయ అధ్యక్షులు జిల్లాల వ్యాప్తంగా కమిటీలు వేసి బీసీల కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. బీసీ వికాస సమితి అధ్యక్షులు నర్సింగరావు మాట్టాడుతూ.. బీసీ లందరూ వార్డ్ మెంబర్, సర్పంచి నుండి ఎమ్మెల్యే, ఎంపీ అన్నింటికి పోటీ చేయాలని కోరారు. ముఖ్యంగా జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొని బీసీలు పోటీ చేయాలన్నారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మాట్లాడుతూ.. ఐకమత్యమే మహాబలమని, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని, బీసీలందరూ తప్పక పోటీ చేసి రాజ్యాధికారం వైపు దూసుకుపోవాలని కోరారు.

సాధ్యం కావాలంటే రథయాత్ర చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకతాటి పైకి తీసుకొని వచ్చి అధికారుల లక్ష్యంతో అందరూ పని చేస్తే సాధించటం సాధ్యమే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక జేఏసీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, జనగణన కులగనన చేస్తానని వాగ్దానం చేశారని, రాబోయే ఎంపీ ఎలక్షన్లో అన్ని పార్టీలు బీసీలకు 30 నుండి 50% వరకు సీట్లు కేటాయించాలని కోరారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీసీ రథయాత్ర చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బీసీలను కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని జేఏసీ ద్వారా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లటానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కాసిం సార్ భేరీ రామచంద్ర యాదవ్, కస్తూరి గోపాలకృష్ణ, వికాస్ నర్సింగరావు, మధుకరాచారి, ఆర్కే సాయన్న, ఎస్సీ జేఏసీ అధ్యక్షులు నరసింహ, వెంకటేశ్వరరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, కుమార్ యాదవ్, మధు యాదవ్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here