రెండో విడుత గొర్రెలు త్వరగా ప్రారంభించండి

  • సీఎం రేవంత్ రెడ్డి ని కోరిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకుల సమావేశంలో రెండో విడత గొర్రెల పంపిణీ త్వరగా పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామ్ చందర్ యాదవ్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, ముఖ్య సలహాదారి బేరి రామ్ చందర్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి గొర్రెల కాపరుల సమస్యలపై విన్నవిస్తూ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గొర్రె కాపరుల పక్షాన సానుకూలంగా స్పందించి రెండో విడత గొర్రెల పంపిణి త్వరగా చేయాలని, ఎన్ సి డి సి నా బర్డ్స్ లోన్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నైనా సహకార సంఘాల సొసైటీల ద్వారా నగదు బదిలి చేయాలని వేడుకొన్నారు.

 

కార్యక్రమంలో ముఖ్య నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి, బుచ్చన్న యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెగొండ రాజన్న యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రామాంజి యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్ యాదవ్, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు గజ్జి రమేష్ యాదవ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి ప్రసాద్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజు యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నారాయణ యాదవ్, జిల్లాల నాయకులు సంధన, వేణి, మల్లేష్ యాదవ్, గట్టు మహేష్ యాదవ్, పరశురామ్ యాదవ్, రాజకుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, జంగిలి సత్తన్న యాదవ్, మండలం అధ్యక్షులు జక్కుల తిరుపతి యాదవ్, అంజిత్ యాదవ్, మంతుర్తి మల్లేష్ యాదవ్, ఉమేష్ యాదవ్ పాల్గొన్నారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here