- శనివారం (నేడు) సాయంత్రం 5 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ
- నివాళి అర్పించనున్న ఉద్యమ రథసారథి కేసీఆర్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న 3 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి బయలుదేరి అమరవీరుల స్తూపం (గన్ పార్క్) వద్ద ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఘన నివాళి అర్పించనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.