- మిద్దెల కీర్తి యాదవ్ ను ఐఏఎస్ చదివించనున్న ట్రస్ట్
- వెల్లడించిన ట్రస్ట్ చైర్మన్ భేరి రామచందర్ యాదవ్
- అనంతరం పుస్తకాలు పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి : సమాజాన్ని ప్రభావితం చేసి మంచి మార్గంలో పయనింప చేయడానికి ఏకైక సాధనం విద్య అని బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భేరి రామచందర్ యాదవ్ అన్నారు. మిద్దెల కీర్తి యాదవును ఐఏఎస్ చదువు కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అందుకు సంబంధించి పుస్తకాలు కూడా అందించారు.
ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తాను చదువుకోలేదని, కానీ చదువు విలువ తెలుసునన్నారు. తన తల్లిదండ్రుల పేరిట బేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్టును స్థాపించి సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. తన స్వగ్రామమైన మిట్ట కంకల్లో ప్రతి ఏటా ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ, ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులకు, నిరుద్యోగులకు తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. మనిషికి విద్య లేకపోతే గుడ్డివాడితో సమానమని నమ్ముతానన్నారు. మిద్దెల కీర్తి యాదవ్ బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వాలని, సమాజంలోని అసమానతలను తొలగించాలని, ధర్మబద్ధంగా న్యాయపక్షంగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశీర్వదిస్తూ ఐఏఎస్ చదివే క్రమంలో అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు.