- తాగునీటి సరఫరా, యూజిడి నిర్వహణపై జలమండలి అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గాంధీ సమీక్ష సమావేశం
- అధికారులకు ఆదేశాలు జారీ
నమస్తే శేరిలింగంపల్లి: రాబోయే ఎండాకాలంను దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఎద్దడి లేకుండా చూడాలని, ప్రజలకు సురక్షితమైన మంచి నీళ్లు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ ఆదేశాలు జారీ చేశారు.
మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరా, యూజిడి నిర్వహణపై జలమండలి అధికారులు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమగ్ర , సంతులిత అభివృద్ధి లో భాగంగా ప్రతి డివిజన్ల లో మౌళికవసతుల కల్పన కోసం ప్రతి డివిజన్ లో అవసరమైన మంచి నీటి పైప్ లైన్ నిర్మానం, యుజీ డి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యవసర పనులను గుర్తించి, ప్రథమ ప్రాధాన్యత గా పనులు గుర్తించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డిజీ ఎం నాగప్రియ , డిజీఎం శరత్ రెడ్డి, మేనేజర్లు సుబ్రమణ్యం , యాదయ్య, నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, పూర్ణేశ్వరి, సునీత, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, మోహన్ గౌడ్ , చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు.