- లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
- పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చేపడుతున్న పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని అధికారులకు తెలిపారు. కల్వర్ట్ నిర్మాణంపై అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని , ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరునని ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్, మోహన్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, దొడ్ల రామ కృష్ణ గౌడ్, గడ్డం రవి యాదవ్ పాల్గొన్నారు.